పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉచిత కరాటే శిక్షణను డీసీపీ రవీందర్ ప్రారంభించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణకు పూర్తి స్థాయిలో పోలీసు భద్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
'ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే... కరాటే శిక్షణ' - పెద్దపల్లిలో అమ్మాయిలకు ఉచిత కరాటే శిక్షణ
విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని పెద్దపల్లి డీసీపీ రవీందర్ అన్నారు.
అమ్మాయిలకు ఉచిత కరాటే శిక్షణ
మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని... పోలీసు శాఖ తరఫున విద్యార్థినులకు ఉచిత కరాటే శిక్షణ ఇస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడమే గాక.. శారీరకంగా ధృఢంగా ఉండటానికి కరాటే ఉపయోగపడుతుందని తెలిపారు.
విక్టరీ షోటోకాన్ ఆధ్వర్యంలో కరాటే ఉచిత శిక్షణ నిరంతరం కొనసాగుతుందని రవీందర్ వెల్లడించారు. ఆపదలో ఉన్నప్పుడు తమను రక్షించుకునేందుకు, ఎలా ప్రతిఘటించాలో శిక్షకులు చూపించారు.
- ఇదీ చూడండి : 'కుమార్తె'పై అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష
TAGGED:
అమ్మాయిలకు ఉచిత కరాటే శిక్షణ