తెలంగాణ

telangana

ETV Bharat / state

చౌరస్తాలో సినిమా షూటింగ్​ ప్రారంభం - గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రమేష్ క్లాప్ కొట్టి ప్రారంభించారు

గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. 'యువ మేలుకో ' అనే చిత్రాన్ని గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రమేష్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. చిత్ర యూనిట్​ నటీనటులపై పలు ప్రదేశాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

Film shooting in Chowrasta begins in godavarikhani peddapalli district
చౌరస్తాలో సినిమా షూటింగ్​ ప్రారంభం

By

Published : Feb 12, 2020, 8:57 AM IST

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో బైరం రవివర్మ దర్శకత్వంలో 'యువ మేలుకో ' అనే సందేశాత్మక చిత్రం నిర్మిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణను గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రమేష్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. యువత గంజాయి, డ్రగ్స్​కు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని సీఐ అన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సందేశాత్మక చిత్రాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. గత తొమ్మిదేళ్లుగా సందేశాత్మక చిత్రాలు నిర్మించిన స్థానిక దర్శకులు బైరం రవివర్మను సీఐ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సందేశాత్మక చిత్రాలను నిర్మించి యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. నటీనటులపై పలు ప్రదేశాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

చౌరస్తాలో సినిమా షూటింగ్​ ప్రారంభం

ఇదీ చూడండి :తిరువీధోత్సవాల్లో ఆలరించిన చిన్నారుల నృత్యాలు

ABOUT THE AUTHOR

...view details