సూర్య గ్రహణం సందర్భంగా మంథనిలో గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు. ఈరోజు సుమారు 3 గంటల 29 నిమిషాల పాటు ఏర్పడ్డ చూడామణి నామక రాహుగ్రస్త పాక్షిక సూర్య గ్రహణం సందర్భంగా గోదావరి నదిలో పవిత్ర గ్రహణ స్నానాలు ఆచరించారు. భక్తులు ఉదయం 10 గంటల వరకు నదీతీరానికి చేరుకొని గ్రహణ పట్టు స్నానాలు ఆచరించి, ఉపవాస దీక్షతో భక్తిశ్రద్ధలతో గ్రహణ సమయంలో జపాలు , వేదపారాయణాలు చేశారు. 01:44లకు మరల గోదావరి నదిలో గ్రహణ విడుపు సమయంలో పురోహితులచే ప్రత్యేకంగా మహా సంకల్పం చెప్పించుకుని నదిలో గ్రహణ స్నానాలను ఆచరించి భక్తులు పునీతులు అయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు - peddapalli district news
సూర్య గ్రహణం సందర్భంగా భక్తులు మంథనిలోని గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. నదిలో ఉదయం 10గంటలకు గ్రహణ పట్టు స్నానాలు, విడుపు స్నానాలు చేసి పునీతులు అయ్యారు.
మంథనిలోని గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు