కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో సీపీఎం నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విద్యుత్, వ్యవసాయ సవరణ చట్టాల వల్ల ప్రజలు రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. రైల్వే ప్రైవేటీకరణను రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, మానవత్వం, రక్షణ హరించే పద్ధతిలో ఉన్నాయని జిల్లా కార్యదర్శి రవీందర్ ఆరోపించారు.
'కేంద్రం నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలి' - కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన పెద్దపల్లి
పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో సీపీఎం నేతలు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విద్యుత్, వ్యవసాయ సవరణ చట్టాల వల్ల ప్రజలు రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారం ఇవ్వకపోవడం, కార్పొరేట్ సంస్థల పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేందుకు చట్టాలను సవరిస్తూ దేశ ప్రజలను మోసం చేస్తోందన్నారు.
'కేంద్రం నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలి'
రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారం ఇవ్వకపోవడం, కార్పొరేట్ సంస్థల పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేందుకు చట్టాలను సవరిస్తూ దేశ ప్రజలను మోసం చేస్తోందన్నారు. వెంటనే కేంద్రం తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని.. లేదంటే ప్రజా ఉద్యమం చేపడతామని రవీందర్ హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:ప్రజలపై ఎల్ఆర్ఎస్ భారం దారుణం : సీపీఎం నేత నాగయ్య