పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సీపీఎం నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రజలు సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పాలనాధికారికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా పరిష్కారమవ్వని విద్యా, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణీ, నిరుపేదల సంక్షేమం చేపడతామన్న సర్కారు.. ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు.
కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకుల ధర్నా
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు ధర్నాకు దిగారు.
కలెక్టరేట్ఎదుట సీపీఎం నాయకుల ధర్నా
TAGGED:
cpm leaders protest