పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తెల్లవారుజామునే పత్తి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3 గంటలు అయినప్పటికీ పత్తి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనామ్ కేంద్రాన్ని ముట్టడించి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉదయం తీసుకొచ్చిన పత్తిని ఆన్లైన్లో ఎందుకు కొనుగోలు చేయలేదంటూ ప్రశ్నించారు. రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసులు కలుగజేసుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం మార్కెట్ అధికారులతో పోలీసులు మాట్లాడి ఆన్లైన్లో కొనుగోలు ప్రారంభించారు.
పత్తి కొనుగోలు చేస్తారా.. లేదా? : రైతుల ఆందోళన
పంట పండించడానికి రైతన్న ఎంత కష్టపడుతున్నాడో పండిన పంటను అమ్ముకోవడానికి అంత కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు తెల్లవారుజామునే పత్తి తీసుకొచ్చారు రైతులు. మధ్యాహ్నం 3 గంటలు అవుతున్నా కొనుగోలు చేయకపోవడం వల్ల ఆవేదన చెందిన అన్నదాతలు రోడ్డెక్కారు.
పత్తి కొనుగోలు చేస్తారా.. లేదా: రైతుల ఆందోళన
TAGGED:
cotton sale