తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రంలో అధికారంలోకి వచ్చేవి జాతీయ పార్టీలే

కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం జాతీయ పార్టీలకే ఉందని పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్​ అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో అధికారపక్షంపై విమర్శలు సంధించారు.

కేంద్రంలో జాతీయ పార్టీలదే హవా

By

Published : Mar 23, 2019, 7:53 PM IST

కేంద్రంలో జాతీయ పార్టీలదే హవా
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్​ పార్టీ లోక్​సభ అభ్యర్థి చంద్రశేఖర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు సురేఖ నివాసంలో సమావేశం నిర్వహించారు.

పార్లమెంటు ఎన్నికలు కేంద్రానికి సంబంధించినవి

లోకసభ ఎన్నికలు కేవలం కేంద్రంతో ముడిపడి ఉంటాయని చంద్రశేఖర్​ అన్నారు. తెరాస అభ్యర్థులు గెలిచినంత మాత్రాన కేసీఆర్ ప్రధాని కాలేరన్నారు. ప్రధాని కావాలంటే రాహుల్​ గాంధీకి లేదా మోదీకి మాత్రమే అవకాశం ఉందన్నారు.

భాజపా ప్రభుత్వం దేశానికేమీ చేసింది లేదని విమర్శించారు. తనను గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి

ABOUT THE AUTHOR

...view details