తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Bus Yatra in Peddapalli Today : నేడు పెద్దపల్లిలో కాంగ్రెస్​ బస్సు యాత్ర.. బహిరంగ సభలో రాహుల్ ప్రసంగం - నేడు పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్​ బహిరంగ సభ

Congress Bus Yatra in Peddapalli District Today : రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపట్టిన విజయ భేరి బస్సు యాత్ర.. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. బుధవారం ములుగు జిల్లాలో ప్రారంభమైన రాహుల్ గాంధీ యాత్ర రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూర్తి చేసుకుంది. ఈరోజు ఉదయం మంథని నియోజకవర్గం కేంద్రంతో పాటు కమాన్‌పూర్‌ మండలాల్లో జరగనున్న బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

Congress Bus Yatra
Congress Bus Yatra in Peddapalli District Today

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 7:58 AM IST

Congress Bus Yatra in Peddapalli Today నేడు పెద్దపల్లిలో కాంగ్రెస్​ బస్సు యాత్ర

Congress Bus Yatra in Peddapalli District Today : రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపట్టిన విజయభేరి బస్సు యాత్ర నేడు పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. ఉదయం మంథని నియోజకవర్గం కేంద్రంతో పాటు కమాన్‌పూర్‌ మండలాల్లో రాహుల్​గాంధీ యాత్రలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం రామగిరి మండలానికి బస్సు యాత్ర చేరుకున్న తర్వాత అక్కడి సింగరేణి కార్మికులు, రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి నియోజకవర్గం కేంద్రంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

Rahul Gandhi Peddapalli Tour Today : ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నేతలు ముస్తాబు చేస్తున్నారు. బుధవారం ములుగు విజయభేరి సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. బీఆర్​ఎస్​, బీజేపీపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెస్తామన్నారు. తెలంగాణలో పోటీ.. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే అన్న రాహుల్‌.. బీఆర్​ఎస్​, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓటమికి ఆ మూడు కలిసి పని చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

Congress Bus Yatra 2023 Started : కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రారంభించిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ

"ఇక్కడ మీరు జరుపుకొనే సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు ఇస్తాం. కుంభమేళా తరహాలోనే మీ పండగ కూడా ఉంటుంది. కర్ణాటక గానీ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గానీ.. అక్కడ మేం ఏది చెప్పినా అది చేసి చూపుతాం. ఆదివాసీలకు అత్యంత అవసరమైన విషయం భూమి. మీ భూమి, మీ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మీకు మేం తిరిగి వచ్చేలా చేస్తామని గ్యారెంటీ ఇస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్​ఎస్​.. మీ జేబుల నుంచి రూ.లక్ష కోట్లు తీసుకుంది." - రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

Priyanka Gandhi Fires on BRS and BJP : 'బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్‌ మోదీ చేతిలో ఉంది'

Rahul Gandhi Speech At Mulugu Meeting :ములుగు సభలో సుదీర్ఘ ప్రసంగం చేసిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ బీఆర్​ఎస్ సర్కార్‌ రిమోట్ మోదీ చేతిలో ఉందని ఆరోపించారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం మాఫియాలకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ల రాష్ట్ర పాలనలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యల ఆధిపత్యమే కనిపిస్తుందని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా.. ఇప్పటికీ ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలని కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు.

Revanth Reddy Speech at Congress Public Meeting in Vikarabad : 'తెలంగాణ దశ.. దిశ మార్చే సమయం వచ్చింది'

"తెలంగాణలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ పార్టీ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీని మనం ఇప్పటికే ఓడించాం. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ బీఆర్​ఎస్​ గెలవాలని బీజేపీ కోరుకుంటోంది. అందుకు రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. వీరికి ఎంఐఎం తోడైంది. ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు అతి పెద్ద సాక్ష్యం ఏమంటే.. మీ ముఖ్యమంత్రిపై సీబీఐ, ఈడీ, ఐటీ విచారణలు ఏం జరగవు. అన్ని విపక్ష పార్టీల నేతలపై కేసులు పెట్టారు. నాపై 24 కేసులు పెట్టారు. కానీ మీ ముఖ్యమంత్రిపై ఎలాంటి కేసులూ లేవు. మీరు బీఆర్​ఎస్​కు ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్లే." - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Rahul Gandhi Speech at Mulugu Congress Public Meeting : 'దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి'

ABOUT THE AUTHOR

...view details