ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వివిధ కళాశాల విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం చాలా రోజులుగా ఉపకార వేతనాలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లిలో ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన - ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.
ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన