తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబాట తర్వాత ప్రాజెక్టుల బాట: భట్టి

తెలంగాణ ఇచ్చింది... తెచ్చింది కాంగ్రెస్​ పార్టీ అని సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్​పూర్ గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భట్టితో పాటు ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్​ బాబు, పొడెం వీరయ్య తదితరులు పాల్గొని రైతుల సమస్యలు తెలుసుకున్నారు.

తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్​ పార్టీ: భట్టి
తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్​ పార్టీ: భట్టి

By

Published : Feb 12, 2021, 7:30 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తుంటే... సీఎం కేసీఆర్​ రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామనడం దారుణమన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్సాస్​పూర్​లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

తర్వాత ప్రాజెక్టుల బాట పడతాం..

అధికారంలోకి ఇన్నేళ్లు అవుతున్నా ఇంతవరకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ఆక్షేపించారు. రైతుబాట అనంతరం ప్రాజెక్టుల బాట పడతామని... నీళ్లు, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని.. వీటిపై కేంద్ర విజిలెన్స్​ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని భట్టి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు, పొడెం వీరయ్య, మాజీ ఎంపీ మధుయాష్కి తదితరులు పాల్గొని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి: భట్టి

ABOUT THE AUTHOR

...view details