తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్​ భాజపా ఓట్లను కొల్లగొడుతున్నారు' - mp

దేశం అభివృద్ధి చెందాలంటే మళ్లీ మోదీ అధికారంలోకి రావాలని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్​ నరసింహారావు అన్నారు. పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో భాజపా ఎంపీ అభ్యర్థి ఎస్​ కుమార్​ను గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు.

పెద్దపల్లి భాజపా కార్యకర్తల సమావేశం

By

Published : Mar 27, 2019, 5:29 PM IST

పెద్దపల్లి భాజపా కార్యకర్తల సమావేశం
తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నరసింహారావు కోరారు. పెద్దపల్లిలో భాజపా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్​ ఎంపీ అభ్యర్థి ఎస్.కుమార్​, నరసింహరావు పాల్గొన్నారు. భాజపాతో కలసిపని చేస్తున్నామంటూ కేసీఆర్ తమ ఓట్లను కొల్లగొడుతున్నారని నరసింహారావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు శ్రమించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details