సన్నరకం ధాన్యానికి రూ.2500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భాజపా నేతలు ఆందోళన నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి.. రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.
ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని ఆందోళన - BJP STRIKE AT PEDDAPALLY
ప్రభుత్వం చెప్పినట్లుగా సన్నరకాలు వేసిన రైతులకు తక్షణమే మద్దతు ధర ఇవ్వాలంటూ భాజపా నేతలు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి ఆందోళన చేశారు.
'మద్ధతు ధర ఇచ్చేంతవరకు ఆందోళన కొనసాగిస్తాం'
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే సన్నరకాలు పండించినా మద్దతు ధర ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు పోలీసులు.
ఇవీచూడండి:అన్నదాతల అగచాట్లు... ఆర్థిక సాయానికి 'ఆన్లైన్' అవస్థలు