ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని మాజీ ఎమ్మెల్యే, భాజపా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విమర్శించారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైంది : సోమారపు - bjp leader somarapu satyanarayana press meet at peddapalli
కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడం సిగ్గుచేటని భాజపా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కరోనా కట్టిడి విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైంది మాజీ ఎమ్మెల్యే సోమారపు
కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని.. కోవిడ్19 టెస్టులు విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడం సిగ్గుచేటన్నారు. గాంధీ హాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించి కరోనా రోగులను ఆదుకోవాలని, అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆస్పత్రిలో ఉంటూ ప్రజలకు ధైర్యాన్ని అందించాలన్నారు.
ఇదీ చూడండి:'తబ్లీగీలను నిషేధించడంపై కేంద్రం వైఖరేంటి?