తెలంగాణ

telangana

ETV Bharat / state

'అద్భత సుడిగాలితో అరుదైన దృశ్యం' - LB STADIUM

సుడులు తిరుగుతూ వచ్చిన గాలి దాదాపు ఇరవై నిమిషాలు కొనసాగిన దృశ్యం గోదావరిఖని పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ ప్రాంత ప్రజలను ఈ అరుదైన సంఘటన మంత్రముగ్ధుల్ని చేసింది.

సింగరేణి క్రీడా మైదానంలో సుడులు తిరుగుతూ వచ్చిన గాలి

By

Published : Apr 17, 2019, 9:50 AM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని సింగరేణి జవహర్ లాల్ నెహ్రు క్రీడామైదానంలో ఆకస్మికంగా అద్భుతం చోటు చేసుకుంది. సింగరేణి క్రీడా మైదానంలో సుడులు తిరుగుతూ వచ్చిన గాలి దాదాపు ఇరవై నిమిషాలు కొనసాగింది. ఒక్కసారిగా సుడిగాలి వచ్చి ఆకాశం పైకి లేచి అద్భుత దృశ్యమే సృష్టించింది. ఒక చివర నుంచి మొదలై క్రీడామైదానం చివరిలోని పొగ గొట్టం నుంచి ఆకాశంలోకి ఎగిసిపడింది.
మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల జన సంచారం పెద్దగా లేదు. కొద్ది మంది మాత్రమే ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశారు. సామాజిక మాధ్యామాల్లో విస్త్రృతంగా ప్రచారం అయ్యింది. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలను ఈ అరుదైన సంఘటన మంత్రముగ్ధుల్ని చేసింది.

క్రీడామైదానం చివరిలోని పొగ గొట్టం నుంచి ఆకాశంలోకి ఎగిసిపడిన సుడిగాలి

ABOUT THE AUTHOR

...view details