రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తండ్రికి గాయాలు - accident
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. తండ్రికొడుకులు ద్విచక్రవాహనంపై వెళ్తండగా వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో కొడుకు మృతి చెందగా... తండ్రికి గాయాలయ్యాయి.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లికి చెందిన పెంతల మల్లారెడ్డి తన కుమారుడు రిచితో కలిసి ఇవాళ గోదావరిఖనికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఆకస్మాత్తుగా వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. బాలుడు రిచిత్ అక్కడిక్కడే మృతి చెందగా... మల్లారెడ్డికి గాయాలయ్యాయి. బాలుడు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
TAGGED:
accident