పెద్దపల్లి జిల్లా పాలెం గ్రామంలో తిరుపతి ఎకరం భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకంలో పేరు మార్పిడి చేయడానికి వీఆర్వో లింగస్వామి ఎనిమిది వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించారు. మంగళవారం మధ్యాహ్నం పెద్దపల్లిలోని తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్వో లింగస్వామికి ఎనిమిది వేలు లంచం ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీఆర్వోపై కేసు నమోదు చేసి రేపు అనిశా న్యాయస్థానంలో హాజరు పరుస్తామని అధికారులు వెల్లడించారు.
అనిశా అధికారులకు చిక్కిన వీఆర్వో
పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పిడి కోసం లంచం డిమాండ్ చేశిన ఓ వీఆర్వో అడ్డంగా దొరికిపోయాడు.
అనిశా అధికారులకు చిక్కిన వీఆర్వో