పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక కార్యాలయం ఎదుట గోదావరిఖని సప్తగిరి కాలనీ పాఠశాలకు వెళ్లే గుంతల బురద రోడ్లను మరమ్మతు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన ధర్నాలో పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలకు వెళ్లే రోడ్లు గుంతల మయమై విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. సప్తగిరి కాలనీ రోడ్లకు మరమ్మతు చేయాలని పలుమార్లు అధికారులకు, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించినా ఫలితం లేదన్నారు. ఈ సందర్భంగా నగరపాలక కమిషనర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు.
గుంతల రోడ్లకు మరమ్మతు చేయాలని ధర్నా - గోదావరిఖని
పెద్దపల్లి జిల్లాలో రామగుండం నగరపాలక కార్యాలయం ఎదుట గోదావరిఖని సప్తగిరి కాలనీ పాఠశాలకు వెళ్లే బురద రోడ్లను మరమ్మతు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేయాలని ధర్నా