అంబులెన్సు అందుబాటులో లేకపోవడం ఓ గర్భిణీ ఆటోలోనే ప్రసవించారు. కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్తుండగా పెద్దపెల్లి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సుల్తానాబాద్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ప్రియాంకకు పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి ఫోన్ చేశారు. ఆ సమయంలో అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో ఆటోలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ప్రియాంక పండంటి పాపకు జన్మనిచ్చింది.
అంబులెన్సు అందుబాటులో లేక.. ఆటోలోనే ప్రసవం! - తెలంగాణ వార్తలు
అంబులెన్సు అందుబాటులో లేకపోవడం వల్ల ఓ గర్భిణీ ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ఈ సంఘటన జరిగింది. చిన్నబొంకూర్ గ్రామానికి చెందిన కమల అనే ఆశా వర్కర్ కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఆమె తెలిపారు.
అంబులెన్సు అందుబాటులో లేక.. ఆటోలోనే ప్రసవం!
చిన్నబొంకూర్ గ్రామానికి చెందిన కమల అనే ఆశా కార్యకర్త కాన్పు చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఆమె తలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించి ఆటోలో ప్రసవం చేసిన ఆశా కార్యకర్తను గ్రామస్థులు అభినందించారు.
ఇదీ చదవండి:కొత్త కారా.. కొన్నాళ్లు ఆగాల్సిందే