తెలంగాణ

telangana

ETV Bharat / state

మరణ వాంగ్మూలం రాసి ఒప్పంద ఉద్యోగి అదృశ్యం - peddapalli

పెద్దపల్లి జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ ఒప్పంద ఉద్యోగి అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ మహిళా ఉద్యోగిని వేధింపులకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్​నోట్​ రాసిపెట్టి వెళ్లిపోయాడు.

మరణ వాంగ్మూలం రాసి ఒప్పంద ఉద్యోగి అదృశ్యం

By

Published : Aug 11, 2019, 12:49 AM IST

పెద్దపల్లి జిల్లాలోని ఎనిమిదో ఇంక్లైన్ ​కాలనీకి చెందిన ఎలగందుల రమేష్ అనే వ్యక్తి శుక్రవారం నుంచి కనిపించకుండాపోయాడు. జిల్లా విద్యాశాఖలో ఒప్పంద ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే శాఖలో పనిచేస్తున్న మరో ఉద్యోగిని ప్రవర్తనతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉత్తరం రాసి వెళ్లిపోయాడు. గత కొద్ది కాలంగా అదే శాఖలో సెక్టోరియల్ అధికారి పోస్టుకు దరఖాస్తు చేయగా... ఉద్యోగం రాకుండా ఆ ఉద్యోగిని అడ్డుపడటం వల్ల మనస్తాపం చెందినట్లు సూసైట్​నోట్​లో పేర్కొన్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరి దారిలో తనతో తెచ్చుకున్న బ్యాగును గోదావరిఖనిలోని తన సోదరుడి షాపుదగ్గర ఉంచి ఎటో వెళ్లిపోయాడు. ఎంత సేపైనా తిరిగి రాకపోయేసరికి బ్యాగ్​ తెరిచి చూడగా అందులో లెటర్ ఉంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్​ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరణ వాంగ్మూలం రాసి ఒప్పంద ఉద్యోగి అదృశ్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details