పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఖాజామోయినుద్దీన్‌కు వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. లాక్‌డౌన్ నేపథ్యంలో శనివారం ఉదయం 10 నుంచి 1.30 గంటల వరకు కరోనా గురించి ఫేస్‌బుక్ లైవ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. కరోనా గురించి ఖాజామోయినుద్దీన్ 188 నిమిషాలపాటు ప్రసంగించారు.
కరోనాపై 188 నిమిషాల ప్రసంగం
మీరెప్పుడైనా 188 నిమిషాల ప్రసంగం విన్నారా.. అవును అక్షరాలా 3 గంటల 8 నిమిషాలు ఓ వ్యక్తి ప్రసంగించారు. మంథనికి చెందిన ఖాజామోయినుద్దీన్ కరోనా గురించి ఫేస్‌బుక్ లైవ్ కాన్ఫరెన్సు జరిపారు. ఈ తరుణంలో అతనికి వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది.
Breaking News
డిసెంబర్ 17న తొలి కరోనా కేసు నమోదవగా అప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలు, ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై ఖాజామోయినుద్దీన్ విశదీకరించారు. అతని ప్రసంగాన్ని అభినందిస్తూ వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కరీంనగర్ సమన్వయకర్త శివరామకృష్ణ ఖాజామొయినుద్దీన్‌కు డర్‌బుక్‌ఆఫ్ రికార్డ్సులో చోటు కల్పించి ధ్రువపత్రం, జ్ఞాపిక అందజేశారు.
ఇదీ చూడండి :'అడవుల నరికివేత వల్లే కరోనా వైరస్'