Induru young man and American woman marriage: నిజామాబాద్ జిల్లాకు చెందిన అబ్బాయి, అమెరికా అమ్మాయి ఒక్కటయ్యారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని ఓ కల్యాణ మండపంలో ఆర్మూర్ మండలం గోవింద్ పేట్‌కు చెందిన మూగ అభిషేక్, అమెరికాకు చెందిన అలెక్స్‌ను వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది.
ఒక్కటైన ఇందూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి.. పెద్దలను ఒప్పించి మరి.. - love marriage
Induru young man and American woman marriage: ప్రేమించుకోవడానికి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే సరిపోతుంది కులం, మతం, ప్రాంతం ఏవీ అడ్డురావు అని నిరూపించాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు. పై చదువులు కోసమని అమెరికాకు వెళ్లిన ఆయన.. అక్కడ ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారు ఇరు కుటుంబాలను ఒప్పించి అబ్బాయి సొంత ఊరులో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆ జంట ఒక్కటయ్యారు.
Induru young man and American woman marriage
అభిషేక్ గత కొన్ని ఏళ్ల కింద అమెరికాలో చదువు కోసం వెళ్లారు. అక్కడ అలెక్స్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. పెళ్లికి అమెరికా నుంచి అలెక్స్ కుటుంబ సభ్యులు వచ్చి భారతీయ ఆచార సంప్రదాయాల ప్రకారం చీరకట్టులో మెరిశారు. అనంతరం బంధువులతో, గ్రామస్థులతో ముచ్చటించారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.
ఇవీ చదవండి:
Last Updated : Jan 24, 2023, 10:18 PM IST