తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో పర్యావరణ అవగాహన ర్యాలీ - environment

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు స్వచ్ఛంద సంస్థలు, అటవీ శాఖ అధికారులు నిజామాబాద్​లో పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్​ రామ్మోహన్​ రావు హాజరయ్యారు.

రామ్మోహన్​ రావు

By

Published : Jun 5, 2019, 12:44 PM IST

నిజామాబాద్​లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు, అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్​ రామ్మోహన్​ రావు జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని కలెక్టర్ మైదానం నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. భూమండలం నుంచి ప్లాస్టిక్​ను తరిమి కొట్టాలని కలెక్టర్​ పులునిచ్చారు. ప్రతి ఒక్కరు సహకారం కావాలన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహస్థులు, వారి వారి కార్యాలయాల్లో, పాఠశాల్లో, వీధుల్లో ఇతర స్థలాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో తగ్గించాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం చేపట్టాలన్నారు.

నిజామాబాద్​లో పర్యావరణ అవగాహన ర్యాలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details