నిజామాబాద్ నగరంలో మహిళా కార్పొరేటర్ భర్తను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. స్థానిక 45వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్ భర్త.. తమ కూతురిని మోసం చేశాడంటూ ఉదయం కార్పొరేటర్ ఇంటి ముందు తల్లిదండ్రులు ఆందోళన చేశారు. తమ కూతురికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కార్పొరేటర్ భర్తపై చెప్పుతో దాడి.. అసలేం జరిగింది.? - Woman slapping corporator husband in nizamabad
ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మొదటగా స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తారు. సమస్యను విన్నవించుకుంటారు. పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తారు. కానీ ఆ ప్రజాప్రతినిధి కుటుంబం వల్లే వారికి చిక్కులు వస్తే... ఆగ్రహావేశంలో చెప్పుతో కొడితే.. ఇలాంటి ఘటనే నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
కార్పొరేటర్ భర్తపై చెప్పుతో దాడి
ఈ క్రమంలో కార్పొరేటర్ భర్త, బాధిత మహిళ తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవలో కార్పొరేటర్ భర్తను బాధితురాలి తల్లి చెప్పుతో కొట్టింది.
ఇదీ చదవండి:KTR latest news: కేటీఆర్‌ను కలిసిన డీఎంకే ఎంపీలు.. ఆ లేఖలో ఏముందంటే...