సికింద్రాబాద్ నుంచి ముంబయి వెళ్లే దేవగిరి రైలులో ఓ నిండు గర్భిణీ ప్రసవించింది. పురిటినొప్పులు అధికమవ్వడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దేవగిరి రైలులో సాగర్ అనే ఓ నిండు గర్భిణీ ప్రయాణిస్తోంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తోటి ప్రయాణికులు గమనించి 108కు సమాచారం అందించారు. అయితే రైలు నిజామాబాద్ స్టేషన్‌కు వచ్చేసరికి గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
రైలులోనే ప్రసవించిన మహిళ.. తల్లీబిడ్డ క్షేమం
ఓ గర్భిణీ రైలులోనే ప్రసవించింది. డెలివరీ కోసం తల్లితో కలిసి తమ సొంతూరికి వెళ్తుండగా.. మార్గమధ్యలోనే నొప్పులు రావడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సికింద్రాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న దేవగిరి రైలులో ఈ సంఘటన చోటుచేసుకుంది.
రైలులోనే ప్రసవించిన మహిళ.. తల్లీబిడ్డ క్షేమం
అనంతరం నిజామాబాద్ స్టేషన్ నుంచి తల్లీబిడ్డలను అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రసవం కోసం హైదరాబాద్ నుంచి తల్లితో కలిసి ముద్ఖేడ్కు వెళ్తుండగా మధ్యలోనే ఇలా ప్రసవించింది.
ఇదీ చూడండి: Moving scarecrow: ఆ రైతు పొలంలోని దిష్టిబొమ్మను చూస్తేనే అడవి జంతువులకు హడల్