కొవిడ్ సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న కరోనా సేవలపై ఆరా తీశారు. ఆక్సిజన్ వ్యవస్థను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరిక మేరకు ఆర్మూర్ ఆసుపత్రిలోని వంద పడకలకు రాష్ట్రప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉందన్నారు. వైరస్‌తో బాధపడుతోన్న ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించామన్నారు. అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి.. డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు.