పోడు భూములకు శాశ్వత పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. మాక్లూర్ మండలం కల్లెడ నుంచి వచ్చిన రైతులు.. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అటవీ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
'పోడు భూములకు శాశ్వత పట్టాలివ్వండి' - నిజామాబాద్ జిల్లా
దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూముల్లో.. మొక్కలు నాటుతూ అధికారులు సాగుని అడ్డుకుంటున్నారని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట.. సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.
'పోడు భూములకు శాశ్వత పట్టాలివ్వండి'
దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూముల్లో.. మొక్కలు నాటుతూ అధికారులు సాగుని అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. తమ సమస్యలు పరిష్కారించడం లేదని వాపోయారు.
ఇదీ చదవండి:సీల్ లేని బ్యాలెట్ బాక్సులు తెచ్చారని ఏజెంట్ల ఆందోళన