తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు వరకు వాహన సౌకర్యాలు - migrants problems

తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు వరకు నిజామాబాద్​ బాల్కొండ మండల నాయకులు వాహన సౌకర్యాలు కల్పించారు. లాక్​డౌన్​ పూర్తయ్యేవరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అందరూ దీన్ని వినియోగించుకోవాలని సూచించారు.

vehicle arrangements to telangana- Maharashtra border
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు వరకు వాహన సౌకర్యాలు

By

Published : May 7, 2020, 3:09 PM IST

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వద్ద వలసకూలీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.

ప్రశాంత్​రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలోని నేతలు కార్మికులతో పాటు వలస కార్మికులకు నాయకులు అన్నదాన కార్యక్రమం, తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు వరకు వాహన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. లాక్​డౌన్​ ముగిసేంత వరకు వాహన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని నాయకులు తెలిపారు.

ఇదీ చూడండి:భారత్​లో 'విద్య' కోసం అమెరికా భారీ రుణసాయం

ABOUT THE AUTHOR

...view details