పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నిజామాబాద్ జిల్లా ఉప్పలూరు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎలాగైనా తమ భూమిని తమకు ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
మా భూమి మాకు ఇప్పించండి: బాధితులు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను కాజేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఉప్పలూరు గ్రామస్థులు డిమాండ్ చేశారు. తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
మా భూమి మాకు ఇప్పించండి : బాధితులు
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఉప్పలూరు గ్రామానికి చెందిన పేదలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నంబర్ 675, 647, 659లో గల 12 గుంటల భూమిని కేటాయించింది. అయితే ఆ భూమిపై కన్ను పడిన అదే గ్రామానికి చెందిన గోపెడి భూమన్న అక్రమంగా కాజేయాలని చూస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నించిన తమపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'టూల్కిట్' అరెస్టులపై రాజకీయ రగడ