నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మంత్రి స్వగ్రామమైన వేల్పూర్ మండల కేంద్రంలో తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ జెండాఎగురవేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ మధుశేఖర్, మండల కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన పెద్ద బహుమతి తెరాస పార్టీ అని వేముల వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు జనరంజకమైన పాలనను అందిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
బాల్కొండలో తెరాస ఆవిర్భావ వేడుకలు - minster
తెరాస ఆవిర్భావ వేడుకలు నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెరాస ఆవిర్భావ వేడుకలు