నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పసుపు రైతులను మోసం చేశారని తెరాస ఎమ్మెల్సీ రాజేశ్వర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానని ఎంపీ బాండ్ పేపర్ రాసి ఇచ్చారని.... తీసుకురాలేదంటే రైతులే ఆయనను జైలుపాలు చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రిని ఎంపీ జైలుకు పంపిస్తా అంటున్నారన్న ఎమ్మెల్సీ... అభివృద్ధి పనులు చేసినందుకు జైల్లో వేస్తావా అని ప్రశ్నించారు.
'పసుపు రైతులను ఎంపీ అర్వింద్ మోసం చేశారు'
నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై తెరాస ఎమ్మెల్సీ రాజేశ్వర్ ధ్వజమెత్తారు. పసుపు బోర్డు తెస్తానని ఎంపీ బాండ్ పేపర్ రాసిచ్చారని... తీసుకురాలేదంటే నిజామాబాద్ రైతులే జైలుపాలు చేస్తారని పేర్కొన్నారు.
'పసుపు రైతులను ఎంపీ అర్వింద్ మోసం చేశారు'
ముందుగా పసుపు బోర్డుపై గెలిచిన నిజామాబాద్ ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేసి... ఆ తర్వాత తమిళనాడులో హామీ ఇవ్వమని భాజపా అధిష్ఠానానికి సూచించాలని ఎంపీని కోరారు. వెంటనే సీఎం కేసీఆర్‌కి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఎంపీ అర్వింద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:పేదలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా ఉండేలా ఇళ్ల నిర్మాణం: కేటీఆర్