తెలంగాణ

telangana

ETV Bharat / state

మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడు, బాధతో అత్త మృతి - చేపూర్​ గ్రామంలో విషాద ఛాయలు

వేర్వేరు కారణాలతో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. కానీ కరోనా కారణంగా మృతి చెంది ఉంటారని స్థానికులు వారి అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులే కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లాలో జరిగింది.

chepur nizamabad, Three people died in the same house
ఒకే ఇంట్లో మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి

By

Published : Apr 19, 2021, 12:18 PM IST

Updated : Apr 19, 2021, 12:38 PM IST

ఒకే ఇంట్లో మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడిన హృదయ విదారక ఘటన నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్​లో చోటుచేసుకుంది. మల్కన్న(66) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. దీంతో ఇద్దరు కుమారులు, కుమార్తెలు, కొడళ్లు, అల్లుళ్లు అంత్యక్రియలకు వచ్చారు. ఇతర కార్యక్రమాల కోసం అక్కడే ఉన్నారు.

ఆదివారం ఉదయం చిన్న కుమార్తె భర్త లక్ష్మణ్(45) గుండె పోటుతో మరణించారు. ఆయన మృతదేహాన్ని నిర్మల్ జిల్లాలోని సొంత గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయం మల్కన్న భార్య మల్కవ్వ(60)కు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు అల్లుడి మరణ వార్త తెలియడంతో ఆమె మనస్తాపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. వృద్దురాలు కొవిడ్​తో మృతి చెంది ఉంటుందని గ్రామస్థులు ఎవరూ అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. కుటుంబ సభ్యులే అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఇదీ చూడండి :మీ కుటుంబం విలువ రూ.5 వేల కంటే తక్కువా?

Last Updated : Apr 19, 2021, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details