నిజామాబాద్ నగరం సరస్వతినగర్, రోడ్ నెంబర్ 2లో చోరీ జరిగింది. నగరానికి చెందిన గురు ప్రసాద్ వివాహాది కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన చోరగాళ్లు తమ చేతివాటం ప్రదర్శించారు. బాధితుడి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో అవాక్కయ్యారు. తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు, బీరువాలోని 8 తులాల బంగారం, 18 వేల నగదు, ఒక వెండి గ్లాసును తస్కరించినట్ల బాధితుడు వాపోయారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాళం వేసిన ఇంట్లో దొంగతనం... భారీగా సొత్తు చోరీ - robbery case latest News
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సరస్వతినగర్, రోడ్ నెంబర్ 2 కాలనీలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా సంపదను దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాళం వేసిన ఇంట్లో దొంగతనం... భారీగా సొత్తు చోరీ