తెలంగాణ

telangana

ETV Bharat / state

8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం: మంత్రి ప్రశాంత్​రెడ్డి - minister prasanth reddy review on grains procurement

ఈ ఏట 8 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు. నిజామాబాద్​ కలెక్టరేట్​లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.

prasant reddy
నిజామాబాద్​లో ధాన్యం సేకరణపై మంత్రి ప్రశాంత్​రెడ్డి సమీక్ష

By

Published : Apr 4, 2021, 5:51 AM IST

ఈ ఏడాది యాసంగిలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్​లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు.

యాసంగిలో 3.87 లక్షల ఎకరాల్లో వరి సాగైందని 10.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుందన్నారు. 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గన్నీ సంచుల కొరత, రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. తాలు లేని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి:వ్యవసాయంలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోంది: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details