తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​తో కష్టాల్లో పడ్డ బెంగాలీ స్వర్ణకారులు - Bengali Jewelers struggled with lockdown in Nizamabad District

స్వర్ణకారులు మగువల అందాలను రెట్టింపు చేసే కార్మికులు. బంగారు, వెండి నగలను తయారు చేసే శ్రామికులు.. అతివలు ధరించే అందాల ఆభరణాల వెనక కనపడని ఆజ్ఞాత వాసులు.. వెరసి బెంగాలీ కళాకారులు, పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్​లు, ఇతరత్రా వేడుకలు ఏవైనా ఉంటేనే వీరికి చేతి నిండా పని ఉండేది. కానీ కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్ విధించడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్​లు, వేడుకలు అన్నీ రద్దయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో చేయడానికి పని లేక, సొంత ఊరికి వెళ్లే వీల్లేక... ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్వర్ణకారులు.

Troubles of Bengali Migrant Jewelers
బెంగాలీ స్వర్ణకారుల కష్టాలు

By

Published : May 6, 2020, 8:56 PM IST

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా పరిధిలో 20,000మంది స్వర్ణకారులు నివసిస్తున్నారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో 3000 మంది స్వర్ణకారులుండగా, నగరంలో 1000మంది బెంగాలీ కళాకారులు ఆభరణాల తయారీనే జీవనోపాధిగా మార్చుకొని బతుకుతున్నారు. అంతేకాక ఆర్మూర్, భీంగల్, బోధన్, కామారెడ్డి ప్రాంతాల్లో మరింత మంది ఉపాధి పొందుతున్నారు. లాక్​డౌన్​ కారణంగా తినడానికి తిండి కూడా దొరకని విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని... లేదంటే తిరిగి బెంగాల్​కు పంపే ఏర్పాట్లు అయినా చేయాలని విజ్ఞప్తి చేస్తోన్న నగర పరిధిలోని స్వర్ణకారులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

బెంగాలీ స్వర్ణకారుల కష్టాలు

ABOUT THE AUTHOR

...view details