తెలంగాణ

telangana

ETV Bharat / state

SRSP WATER FLOW: ఎస్‌ఆర్‌ఎస్పీకి భారీ వరద.. 32 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయంలో నీటి ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం 32 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల చేస్తున్నారు.

SRSP WATER FLOW
శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద

By

Published : Sep 24, 2021, 3:29 PM IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్‌ జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,18,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.

శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద

దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ 32 ప్రధాన గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లక్ష 12 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.9 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు వెల్లడించారు. నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు దిగువన పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:

floods to projects: వరుణ ప్రభావంతో కొనసాగుతున్న వరద.. నిండుకుండలా జలాశయాలు

ABOUT THE AUTHOR

...view details