నిజామాబాద్‌లోని శ్రీరాం సాగర్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా నిత్యం కురుస్తున్న వర్షాలకు నిజాం సాగర్‌కు వరద నీటి ప్రవాహం వస్తూనే ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 84.291 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 1,46,874 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా.. 1,25,000 క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లో ఉందని అధికారులు స్పష్టం చేశారు.
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద ప్రవాహం! - శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. రోజుకు లక్షా నలభై వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద ప్రవాహం!