తెలంగాణ

telangana

ETV Bharat / state

"శ్రీరామ" సోయగం: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అధికారులు ప్రాజెక్టు పూర్తి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అక్కడి దృశ్యాలు చూపరులను కట్టి పడేశాయి.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 గేట్ల ఎత్తివేత

By

Published : Oct 26, 2019, 12:35 PM IST

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 గేట్ల ఎత్తివేత

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఉన్న 42 గేట్లను విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. అందువల్ల ప్రాజెక్టు పూర్తి గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు గరిష్ఠంగా కొనసాగుతోంది. 42 గేట్లు ఎత్తి వేయడం వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details