ఆయిల్ పామ్ పంటతో రైతులకు మంచి లాభాలు వస్తాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా నసరుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పెంచుతున్న ఆయిల్ పామ్ చెట్లను పోచారం పరిశీలించారు. దేశానికి ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయల విలువైన వంట నూనెలు దిగుమతవుతున్నాయని తెలిపారు.
ఆయిల్ఫామ్ సాగుతో ఆశించిన లాభాలు: పోచారం
నిజామాబాద్ జిల్లా నసరుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పెంచుతున్న ఆయిల్ పామ్ చెట్లను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
speaker popcharam srinivas reddy inspected Oilpalm crop in boppaspally
రాష్ట్రంలోని 26 జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా భూములు ఆయిల్ పామ్ తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయని రిపోర్ట్ వచ్చిందన్నారు. ఒక్కసారి ఆయిల్ పామ్ చెట్లు నాటితే 4 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడులు వస్తాయని వివరించారు. రైతులకు ఎకరాకు ఏటా లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు లాభం వస్తుంన్నారు. ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.