కరోనా వ్యాప్తితో నిర్మానుష్యంగా మారిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పాఠశాలలు.. విద్యార్థుల రాకతో నేడు కళకళలాడుతున్నాయి. కొవిడ్ నిబంధనలు మధ్య తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. తరగతిగదిలో 20 మంది మాత్రమే కూర్చునేలా పాఠశాలల యాజమాన్యం ఏర్పాట్లు చేశారు.
'తల్లిదండ్రుల అంగీకారముంటేనే.. పాఠశాలకు అనుమతి' - schools reopened in telangana
పది నెలల తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా నిబంధనల మధ్య తొమ్మిది, పదో తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకున్న విద్యార్థులను మాత్రమే పాఠశాలకు అనుమతిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం
తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకున్న విద్యార్థులను మాత్రమే పాఠశాలలోనికి అనుమతించారు. ఇన్నాళ్లు ఇంట్లోనే ఉండి డిజిటల్ పాఠాలు విన్న విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత తమ స్నేహితులను కలవడం ఆనందంగా ఉందని కేరింతలు కొడుతున్నారు.