మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో సౌదీ అరేబియాలో చిక్కుకున్న ఓ వ్యక్తి స్వస్థలానికి చేరుకున్నాడు. ఆర్మూర్‌కు చెందిన అంకమొల్ల రవి ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. అక్కడ అతనిని పనిలో పెట్టుకున్న యజమాని రవిని తీవ్రంగా వేధించసాగాడు. రవి పరిస్థితి తెలుసుకున్న కవిత సౌదీలో భారత రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఆమె ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కవిత వినతికి సానుకూలంగా స్పందించిన వారు రవికి విముక్తి కల్పించారు.
కార్మికుడు వేడుకున్నాడు.. మాజీ ఎంపీ స్పందించింది - Former MP kavitha help saudi labour
తెలంగాణకు చెందిన ఓ కార్మికుడు సౌదీలో తీవ్ర వేధింపులకు గురయ్యాడు. తన యజమాని చిత్రహింసలకు పాల్పడుతున్నాడని తనను రక్షించాలని కోరాడు. స్వదేశానికి తెప్పించాల్సిందిగా మే నెలలో వేడుకున్నాడు. స్పందించిన మాజీ ఎంపీ కవిత అక్కడి అధికారులతో మాట్లాడి తను స్వదేశానికి తిరిగి వచ్చేలా కృషి చేసింది.
కార్మికుడు వేడుకున్నాడు.. మాజీ ఎంపీ స్పందించింది
అతని స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా చేపూర్ గ్రామానికి చేరేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. స్వదేశానికి తిరిగి వచ్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి రవి కృతజ్ఞతలు తెలిపారు. రవి విషయంలో కవిత సూచన మేరకు సహకరించిన భారత కాన్సులేట్ జనరల్ నూర్ ఉర్ రహ్మాన్, వేల్ఫేర్ అధికారి అలీంలకు జాగృతి బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి :జగన్‌తో కేసీఆర్ చీకటి ఒప్పందం.. త్వరలోనే బయట పెడతాం: నాగం