తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూరు వాసుల సంక్రాంతి స్పెషల్ ఫేవరేట్.. ఈ ​ఘేవర్ స్వీట్ - Ghevar sweet special in Nizamabad

Sankranti Special Sweet in Nizamabad: సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది.. పిండివంటకాలే. తీరైన వంటకాలు అందరి నోరూరిస్తాయి. సకినాలు, చెగోడీలు, వడియాలు వంటిసంప్రదాయ వంటకాలు పండుగ పూట ప్రతిఇంట్లోనూ కనిపిస్తాయి. సంక్రాంతికి నిజామాబాద్‌లో ఓ ప్రత్యేకమైన తీపి వంటకం లభిస్తుంది. సంక్రాంతి వారం ముందు నుంచి పండగ అయ్యేవరకు మాత్రమే అది లభిస్తుంది. రాజస్థాన్ వాసులకు ప్రత్యేకమైన ఘేవర్ అనే తీపి వంటకానికి సంక్రాంతి వేళ నిజామాబాద్‌లోనూ మంచి డిమాండ్ ఉంది.

Nizamabad
Nizamabad

By

Published : Jan 15, 2023, 6:37 AM IST

Updated : Jan 15, 2023, 7:01 AM IST

ఇందూరు వాసుల సంక్రాంతి స్పెషల్ ఫేవరేట్.. ఈ ​ఘేవర్ స్వీట్

Sankranti Special Sweet in Nizamabad: ఘేవర్ అనేది రాజస్థానీ సంప్రదాయ పిండివంటకం. ఐదు దశాబ్ధాలుగా.. నిజామాబాద్ వాసులకు ఆ ఘేవర్ మిఠాయి లభిస్తోంది. రాజస్థాన్‌కు చెందిన పలుకుటుంబాలు.. నిజామాబాద్‌కి వచ్చిమిఠాయి దుకాణాలు, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. సంక్రాంతి అంటే మనకు పిండివంటలు ఎలాగో రాజస్థానీలకు ఘేవర్ స్వీట్ సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైంది. మార్వాడీలు.. తమ బంధు మిత్రులు ఎక్కడ ఉన్నా వారికి ఆ మిఠాయి పంపి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా వస్తోంది.

పదిహేను రోజులు మాత్రమే: నిజామాబాద్‌కు వచ్చి స్థిరపడ్డ రాజస్థానీ కుటుంబాల్లోని ఒకరు ఈ ఘేవర్ స్వీట్ తయారుచేయడం ప్రారంభించారు. తొలుత కేవలం మార్వాడీలకు పరిమితమైన ఆ స్వీట్‌ని క్రమంగా స్థానికులు ఇష్టంగా తినడంతో ఆదరణ పెరిగింది. సంక్రాంతికి వారంముందు నుంచి తయారీ ప్రారంభించి పండగ తర్వాత ఆపేస్తారు. పదిహేను రోజులు మాత్రమే నిజామాబాద్‌లో లభిస్తుంది. ఘేవర్‌ను మూడు రకాలుగా తయారు చేస్తుంటారు.

సాధారణఘేవర్, మలైఘేవర్, షుగర్ లెస్‌ఘేవర్‌లో లభిస్తుంది. పాలు, మైదా, గోధుమపిండి, నెయ్యితో ఘేవర్‌నురుచికరంగా తయారుచేస్తారు. బాగా కాగే నూనెలో ప్రత్యేకంగా తయారు చేసిన పెనంపై సిద్ధం చేస్తారు. ఒక కిలో ముడి పదార్థాల నుంచి 200 గ్రాముల ఘేవర్ స్వీట్ ఘుఘుమలాడే సువాసనతో బయటకు వస్తుంది. మొదట్లో కేవలంరాజస్థానీ మిఠాయి దుకాణాల్లో మాత్రమే లభించేది. డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం అన్నిదుకాణాల్లో సంక్రాంతికి లభిస్తోంది.

ఘేవర్‌ రుచికి దాసోహమైపోతున్నారు: నిజామాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన స్వీట్‌ను ఇతర రాష్ట్రాల్లోని బంధువుల కోసం విదేశాలకూ పంపిస్తున్నారు. స్థానికులు సైతం ఘేవర్‌ రుచికి దాసోహమైపోతున్నారు. సంక్రాంతి దాటితే దొరకదని ఆ మిఠాయి కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు.

"సంక్రాంతికి ఘేవర్ స్వీట్ తయారు చేస్తాం. ఘేవర్ చేయడానికి 45 నిమిషాలు పడుతుంది. మైదా, పాలు,నెయ్యి కలిపి తయారు చేస్తాం. సంక్రాంతికి వారంముందు నుంచి తయారీ ప్రారంభించి పండగ తర్వాత ఆపేస్తాం." - రాజు శర్మ, ఘేవర్ మిఠాయి దుకాణం యజమాని

"ఘేవర్ అనేది సంక్రాంతి స్పెషల్. ఇది రాజస్థానీ సంప్రదాయం. ఇక్కడి నుంచి ఈ స్వీట్​ను ఇతర ప్రాంతాలకు పంపిస్తారు. నిజామాబాద్​లో తప్ప మరెక్కడా దొరకదు. ఈ మిఠాయి చాలా బాగుంటుంది. అందుబాటు ధరలో లభిస్తుంది." -కొనుగోలుదారులు

Last Updated : Jan 15, 2023, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details