తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో నిరసనల హోరు - ఆర్టీసీ బంద్​

బంద్​ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో శుక్రవారం నుంచే పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్​, బోధన్​ డిపోల నుంచి పోలీసు బందోబస్తు నడుమ బస్సులను నడిపారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు రాళ్లు విసరడంతో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో నిరసనల హోరు

By

Published : Oct 19, 2019, 6:43 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బంద్ ప్రకటనతో నిన్నటి నుంచే వామపక్షాల నేతలను, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. తెల్లవారుజామున న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు నిజామాబాద్ బస్ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేయగా అరెస్టు చేశారు. మున్సిపల్ కార్మిక సంఘాలు నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆందోళన చేయగా అదుపులోకి తీసుకున్నారు. బోధన్​లో బస్ డిపో వద్ద ఆందోళన చేసిన ఆర్టీసీ కార్మికులు, వివిధ వామపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆందోళన చేసిన భాజపా, ఆర్టీసీ కార్మికులు, ఇతర పార్టీల ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్మూర్ ఆర్టీసీ ఐకాస నేతలను ముందస్తు అరెస్టు చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నాయకులు, కార్మికులను అరెస్టు చేశారు. మరోవైపు బంద్ నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా అధికారులు బస్సులు తిప్పుతున్నారు. ఈ క్రమంలో రెండు బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. నిజామాబాద్ -2 డిపో నుంచి వరంగల్ వెళ్తున్న బస్సుపై మాక్లూర్ మండలం ముబారక్ నగర్ వద్ద వెనుక నుంచి రాళ్లు విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. బోధన్ డిపో నుంచి నిజామాబాద్ వస్తున్న పల్లె వెలుగు బస్సుపై రాళ్లు విసరగా అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. పోలీసు బందోబస్తు నడుమ బస్సులను తిప్పే ప్రయత్నం చేశారు అధికారులు. నిజామాబాద్, బోధన్ డిపో నుంచి పదుల సంఖ్యలో అధికారులు బస్సులు నడిపారు. పోలీస్ ఎస్కార్ట్ సాయంతో తాత్కాలిక సిబ్బందితో బస్సులు బయటకు తీస్తున్నారు. ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి డిపోల నుంచి మాత్రం బస్సులు బయటకు రాలేదు. ప్రధాన కూడళ్లు, అన్ని బస్టాండ్​లు, బస్ డిపోల వద్ద పోలీసులను మోహరించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో నిరసనల హోరు

ABOUT THE AUTHOR

...view details