నిజామాబాద్ జిల్లా బోధన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీడబ్ల్యూబీ(సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్) గోదాం ఎదుట మిల్లర్లు ఆందోళన చేపట్టారు. ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం లేవి బియ్యాన్ని సీడబ్ల్యూసీ గోదాంకు తీసుకువచ్చామని.. కానీ అధికారులు బియ్యం లోడ్ దించుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని రైస్ మిల్లర్లు వాపోయారు.
15రోజులుగా నిలిచిన లారీలు.. రైస్ మిల్లర్ల ఆందోళన
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సీడబ్ల్యూసీ గోదాం ఎదుట రైస్ మిల్లర్లు ఆందోళన చేపట్టారు. 15రోజుల క్రితం లేవి బియ్యం లారీలను గోదాంకు తీసుకువచ్చామని.. కానీ అధికారులు లోడ్‌ను దించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీడబ్ల్యూసీ ఎదుట రైస్ మిల్లర్లు ధర్నా
లేవి బియ్యం సకాలంలో ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేశారని మిల్లర్లు గుర్తు చేశారు. బియ్యం పంపించామని.. ఇప్పుడు ఇరు శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గోదాంల వద్ద రోజుల తరబడి బియ్యాన్ని అన్లోడ్ చేయకపోతే అన్ని రకాలుగా తాము నష్టపోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా: మేయర్