సగం వేతనం కూడా ఇవ్వట్లేదు
సరైన వేతనం ఇవ్వట్లేదని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానిలో సగం కూలీ కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగం వేతనం కూడా ఇవ్వట్లేదు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో పని చేసే కార్మికులకు సరైన దినసరి కూలీ రావడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా దినసరి కూలీ.. 225 రూపాయలు వస్తున్నా వంద, నూట ఐదు రూపాయలే మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానిలో సగం వేతనం కూడా ఇవ్వట్లేదని ఆందోళన చేపట్టారు.