పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న పోలీసులు - election
బోధన్ డివిజన్లో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఓటర్లుకు ఇబ్బంది కలగుకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రశాంతంగా పోలింగ్
నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో ప్రాదేశిక ఎన్నికలు రెండో విడత ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 8 మండలాల్లోని 8 జడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాలను తనిఖీలు చేస్తున్నారు.