కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు ఫిర్యాదు దారులు వస్తుండడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు.
నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి రద్దు - నిజామాబాద్ జిల్లా తాజా వార్త
కరోనా నివారణ చర్యల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. దానితో ఫిర్యాదు దారులతో ఎప్పుడూ రద్దీగా కనిపించే పరిపాలనాధికారి భవనం నేడు నిర్మానుష్యంగా మారింది.
ప్రజావాణి రద్దుతో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం వెలవెల
దానితో ఫిర్యాదు దారులు, పలు శాఖల అధికారులు, ఉద్యోగులు లేక కార్యాలయం వెలవెలబోయింది. ఎవరైనా ఫిర్యాదు దారులు వస్తే, వారి కోసం కలెక్టరేట్లో వినతుల పెట్టెను ఏర్పాటు చేశారు. అధికారిని కలవనవరసం లేకుండా వారివారి అర్జీలను ఆ పెట్టెలో వేస్తే, సంబంధిత అధికారి పరిశీలించి సమస్య పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి:అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత