తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలికపై అత్యాచారం కేసు.. నిందితుడు రిమాండ్​కు తరలింపు

Rape on Minor Girl: నిజామాబాద్​ జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం(ఏప్రిల్​ 22) సాయంత్రం జరిగిన బాలికపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్పందించిన పోలీసులు.. చర్యలు తీసుకున్నారు.

rape on minor girl
నిజామాబాద్​లో బాలికపై అత్యాచారం

By

Published : Apr 24, 2022, 3:36 PM IST

Updated : Apr 24, 2022, 3:50 PM IST

Rape on Minor Girl: మద్యం మత్తులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కీచకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్​పల్లి మండల పరిధిలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు గుజ్జెటి నారాయణను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదీ జరిగింది:నిజామాబాద్ జక్రాన్‌పల్లిలో పండ్లరసం కొనిస్తానని చెప్పి.. తొమ్మిదేళ్ల బాలికను తీసుకువెళ్లిన గుజ్జెటి నారాయణను... ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొట్టచేత పట్టుకుని మూడ్నెళ్ల క్రితం కుమార్తెతో కలిసి జక్రాన్‌పల్లికి వచ్చిన దంపతులు... శివారులో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్యాబిడ్డను వదిలేసి భర్త వెళ్లిపోయాడు. సమీపంలో కూలీ పనులు చేసుకుంటూ కుమార్తెను పోషిస్తున్న మహిళ... రోజు మాదిరిగానే ఈనెల 22న బిడ్డను ఇంట్లో వదిలేసి పనులకు వెళ్లింది.

కేసు వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ

ఇదే అదునుగా భావించిన స్థానికుడు నారాయణ.. మద్యం మత్తులో పండ్ల రసం కొనిస్తానని చెప్పి బాలికను కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూలీ పనుల నుంచి ఇంటికొచ్చిన తల్లి... బిడ్డ కనిపించకపోవటంతో సమీప ప్రాంతాల్లో వెతుకుతుండగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... బాలికను ఆస్పత్రికి తరలించారు.

"బాలిక బయట ఆడుకుంటుండగా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నిందితుడు నారాయయణ.. జ్యూస్​ కొనిస్తానని చెప్పి స్థానికంగా ఉన్న గుట్ట మీదకు తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంటికొచ్చి చూసిన తల్లి కూతురు కనబడకపోయే సరికి ఇరుగూపొరుగును ఆరా తీసింది. వారి సహాయంతో చుట్టుపక్కల వెతికితే గుట్టపైన బాలిక ఏడుస్తూ కనిపించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించాం." -వెంకటేశ్వర్లు, ఏసీపీ

చిన్న పిల్లలు ఆడుకునే సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు.. ఎక్కడ ఆడుకుంటున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని ఏసీపీ అన్నారు. ఎవరైనా అపరిచితులు వ్యక్తులు ఇంటి దగ్గరలో కనబడితే వారిని అక్కడి నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి నుంచి చిన్నారులు చాక్లెట్లు, ఇతరత్రా లాంటివి తీసుకోకుండా జాగ్రత్త పడాలని వివరించారు.

ఇవీ చదవండి:'తెరాస నేతలకు మంత్రి పదవులు భాజపా వేసిన భిక్షే'

'కశ్మీర్​లో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం.. కొంత పంథాలో అభివృద్ధి'

ఎంపీ నవనీత్​ కౌర్​ దంపతులకు షాక్.. 14 రోజులు జైలులోనే!

Last Updated : Apr 24, 2022, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details