తెలంగాణ

telangana

ETV Bharat / state

MLA SHAKEEL: ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్థులు - బోధన్​ ఎమ్మెల్యే షకీల్

నిజామాబాద్ జిల్లా బోధన్​ ఎమ్మెల్యే షకీల్​కు చేదు అనుభవం ఎదురైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని ఆయనను నిలదీశారు. దీంతో అడ్డుకున్న వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA SHAKEEL
నిజామాబాద్ జిల్లా బోధన్​ ఎమ్మెల్యే షకీల్​కు చేదు అనుభవం

By

Published : Sep 9, 2021, 7:08 PM IST

నిజామాబాద్​ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వాహనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తుండగా బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ను నీలా పేపర్​ మిల్ గ్రామస్థులు నిలువరించారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వడం లేదని ఆయనను నిలదీశారు.

గ్రామస్థులపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఊహించని సంఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో గ్రామస్థులు, తెరాస నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన వాహనాన్ని అడ్డగించిన గ్రామస్థులపై ఎమ్మెల్యే షకీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై నిలదీస్తే ఎమ్మెల్యే అలా వ్యవహరించడంపై గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు.

నిజామాబాద్ జిల్లా బోధన్​ ఎమ్మెల్యే షకీల్

ఇదీ చూడండి:Rain Effect: వర్షాలతో నిజామాబాద్​ జిల్లా అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్తం

ABOUT THE AUTHOR

...view details