తెలంగాణ

telangana

ETV Bharat / state

పోటెత్తిన జనం.. కానరాని సామాజిక దూరం - nizamabad

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో చాలా మంది లాక్​ డౌన్​ నిబంధనలను ఉల్లఘిస్తున్నారు. మాంసం, కిరాణ దుకాణాలకు గుంపులుగా వచ్చి నిలబడ్డారు. కనీసం మాస్కు​లు కూడా ధరించలేదు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని చేదరగొట్టారు.

people don't follow social distance in nizamabad
పోటెత్తిన జనం.. కానరాని సామాజిక దూరం

By

Published : Mar 29, 2020, 4:14 PM IST

నిజామాబాద్​లోని హైమదీబజార్ ప్రాంతంలో ప్రజలు గుంపుగుంపులుగా చేరారు. మాంసం, కిరాణ, ఇతర దుకాణాల వద్ద ఇబ్బడిముబ్బడిగా నిలబడ్డారు. సామాజిక దూరం సంగతే పట్టించుకోవడం లేదు. మాస్కులు కూడా ధరించకుండా వచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీలకు పని చెప్పారు. పోలీసుల భయంతో కొంతమంది అక్కడి నుంచి వెళ్లినా రద్దీ మాత్రం తగ్గలేదు.

ఎల్లారెడ్డిలో...

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆదివారం సంత కావడం వల్ల జనాలు పోటెత్తారు. మాంసం, కిరణం దుకాణాలు తీయడం వల్ల సామాజిక దూరం మరిచి కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల ఆర్డీవో దేవేందర్ రెడ్డి, తహసీల్దార్ స్వామి, సీఐ రాజశేఖర్ అక్కడికి చేరుకొని జనాలను చెదరగొట్టారు. కిరాణా దుకాణాలు మూసి వేయించారు.

నవిపేట్​లో...

నిజామాబాద్ జిల్లా నవిపేట్​లో మాంసం కోసం వచ్చిన జనాలు సామాజిక దూరం పాటించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి లాఠీలకు పని చెప్పారు.

పోటెత్తిన జనం.. కానరాని సామాజిక దూరం

ఇదీ చదవండి:కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details