నిజామాబాద్ నగరం మార్వాడి గల్లీలోని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తన నివాసంలో కాాషాయపు జెండా ఎగురవేశారు. యావత్ దేశం గర్వించదగిన దినం ఈరోజని.. రామమందిర భూమి పూజ కార్యక్రమాన్ని వీక్షించడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన తెలిపారు.
'అయోధ్యలో భూమిపూజ.. నిజామాబాద్‌లో ఎగిరిన కాషాయ జెండా' - అయోధ్యలో భూమిపూజ సందర్భంగా నిజామాబాద్‌లో ఎగిరిన కాషాయ జెండా
నిజామాబాద్‌లోని మార్వాడీ కాలనీలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తన నివాసంలో కాషాయపు జెండాను ఎగురవేశారు. అయోధ్యలో రామమందిర భూమిపూజ సందర్భంగా ఈరోజు యావత్‌దేశం గర్వించదగిన దినమని ఆయన పేర్కొన్నారు.
'అయోధ్యలో భూమిపూజ.. నిజామాబాద్‌లో ఎగిరిన కాషాయ జెండా'
ప్రధానిగా మోదీ వచ్చాక దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మోదీ చరిత్రలో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు.
ఇదీ చదవండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!